అది గూడు కాదు గుండె
అది గుండె కాదు గుడి
అది గృహం కాదు హృదయం..!!
వాడు గిజిగాడు
అది పిచ్చుక గూడు.!!
అందరికీ నచ్చిన వాడు వాడు
పైవాడు మెచ్చినవాడు వాడు.
వాడు గిజిగాడు
అది పిచ్చుక గూడు.!?
ఆకాశం పైన
భూదేవి కింద
నాలుగు దిక్కులు
చక్కని చుక్కలు..!!
పచ్చని పందిరి
పక్షుల పలుకులు
గాలి పరిమళాలు
పసుపు చందనం దాని అందం....
నుదుట బిందువు దాని బంధువు
గంధపువనం దాని జనం
ఇంద్రధనస్సు దాని మనసు..
పచ్చని తోరణాలు
వెచ్చని కిరణాలు
స్వచ్ఛమైన స్వరాలు
దేవుళ్ళ వరాలు
చిరునవ్వుల కట్నాలు
పువ్వుల రంగుల రత్నాలు
దివ్వెల వెలుగులు
వన్నెల దేవకన్యలు
దిగివచ్చిన దేవతలు
ఆగి చూసిన నక్షత్రాలు
మెరిసిన అందరి కళ్ళు
మెరిసిన మన ఇల్లు
మురిసిన మనవాళ్లు
మన ఇంటికి నిండూ నూరేళ్లు...!!
=============================================
ఆత్మీయ మిత్రుడు నరేందర్ రెడ్డి గృహప్రవేశం
=================================================
డా ప్రతాప్ కౌటిళ్యా పాలెం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి