మౌనానుభూతివెలుగులు”: - మాణిక్యాలరావు పంచదార్ల
 

మౌనపులోయల్లో
ఓగాలికెరటం
మృదువుగాతాకితే
అదిఅలజడికాదు…
అదిఆత్మనుపలకరించే
సునిశితస్పర్శ!
స్తబ్ధతగర్భంలో
నిద్రించినమనసుపొరల్లో
ఓజ్ఞాపకంసునామిలాకాదు,
హంసలాగారెక్కలువిదిలిస్తే—
శూన్యంసుతిమెత్తగాకరిగి
వెలుగులవర్షమైపరిచింది!
అలసటనుకనురెప్పలచాటున
నిశ్శబ్దంగాదాచుకున్నవేళ,
కొత్తఆశనుహృదయ
దీపమైవెలిగించి,
అనిర్వచనీయమైనఆక్షణం
నిశ్శబ్దపుగోడలను
చీల్చుకుంటూ
కాలస్రవంతిలోకరిగిపోయింది…
ఒకమౌనసంగీతమై…
ఒకఅజ్ఞాతఅనుభూతిగా…
ఒకచిరునవ్వువెనుక
దాగినఅంతులేనిప్రకాశమై!
కామెంట్‌లు