జంకావతారాలు !: - పాలగుమ్మి జ్యోతి.


నాన్నా డబ్బులు ఇవ్వు! జంక్ ఫుడ్ కోసం 
జంకు లేకుండా అడిగాడు లడ్డు గాడు! 
 
తినద్దురా! మంచిది కాదంటే వాడు ఎక్కడ 
అలుగుతాడో అని జంకుతూ ఇచ్చాడు తండ్రి!
 
మా కాలంలో మేమెరుగం తల్లీ! జంకు లేకుండా 
బళ్ళ మీద  మగాళ్ళతో ఈ తరం ఆడపిల్లల షికార్లు ఏంటో !
 బుగ్గలు నొక్కుకుంటూ అంది సుబ్బాయమ్మ! 
 
పాలలో నీళ్ళని  కలిపి  నీళ్ళకి కూడా డబ్బులు
 ఏ జంకు లేకుండా వసూలు చేస్తున్నాడు  పాలవాడు! 

బస్టాండ్ లో అందరూ ఉన్నారు, వింటారు అన్న 
జంకు లేకుండా భర్తను  ఉతికారేస్తున్న ఇల్లాలు!

తీసుకున్న పాపపు సొమ్ము లంచంలో  
జంకు లేకుండా దేవుడికి వాటా  ఇచ్చిన భక్తుడు! 

భర్త రంగడు త్రాగొచ్చి కొడతాడని జంకుతున్న రత్తాలు!  

నకిలీ ధ్రువ పత్రముతో జంకక వైద్యం చేస్తున్న వైద్యుడు!

కల్తీ సరుకు జంకు విడిచి అమ్ముతున్న వ్యాపారస్తుడు!

సరిహద్దుల్లో జంకు లేకుండా భరతమాతకు  కావలి కాస్తున్న సైనికులు!
కామెంట్‌లు