నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న రచించిన 1.చిన్ననాటి స్నేహం 2.బడి గంట రెండు పుస్తకావిష్కరణలు మహారాష్ట్ర, షోలాపూర్ లో జరగనున్నాయి. ఈ నెల 29న వ్యావహారిక తెలుగు భాషాదినోత్సవం(గిడుగు రామమూర్తి జయంతి )సందర్బంగా తెలుగు భాషాభివృద్ధి సార్వజనిక్ గ్రంథాలయం, షోలాపూర్ వారి ఆధ్వర్యంలో జరుగనున్నాయి.
అనతి కాల వ్యవధిలో శతాధిక పుస్తకాలు ప్రచురించడమే కాకుండా పలు చోట్ల వాటిని ఆవిష్కరించి ప్రముఖులచే ప్రశంశలు పొందారు. బాలసాహిత్యంలో వీరి విశేష కృషికి గాను అ సంస్థ రచయిత సోమన్నను సన్మానిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. . బహు గ్రంథకర్త,సన్మాన గ్రహీత గద్వాల సోమన్నను తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులందరూ అభినందించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి