సచిన్ టెండూల్కర్ తనకు వచ్చిన ₹20–30 కోట్ల పాన్ మసాలా ప్రకటన ఆఫర్‌ను తిరస్కరించారు. మత్తు, పొగాకు ఉత్పత్తులను ప్రచారం చేయనని తండ్రికి ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారు.
అంత పెద్ద ఆఫర్ ను వదులుకున్నారు కాబట్టే ఆయన అందరికీ ఒక గొప్ప ఆదర్శంగా నిలిచారు. మనం ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నామో ఆలోచించాలి. కేవలం పేరు మాత్రమే కాదు, వారు చేసే మంచి పనులే ముఖ్యం.
ప్రకటనల కోసం కేవలం డబ్బునే లక్ష్యంగా పెట్టుకోకూడదు. డబ్బు సంపాదించడానికి ఎన్నో మంచి మార్గాలు ఉన్నాయి. యువత మనల్ని గమనిస్తున్నారనే బాధ్యతను గుర్తించి, తగు నిర్ణయం తీసుకునే ధైర్యం ఉండాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి