పెదాలపై పదాలు అతడు
పదవులకు రాజు అతడు ఇంద్రుడు
అతడు రాజేంద్రుడు అతడు......!!
అతని పరిపాలన స్వచ్ఛమైన పాలు
అతని పరిపాలన స్వచ్ఛమైన నీరు
అతని సమయపాలన పాలు నీళ్ల లాంటిది
పేరుకు రాజు అతడు
దక్షతకు రాజేంద్రుడు అతడు..!!
స్వచ్ఛమైన మల్లెపువ్వు అతడు
పంచె పరిమళం అతడు
ఎర్రని గులాబీ అతడు
మదిని దోచే పదవి అతడు
పేరుకు రాజు అతడు రాజేంద్రుడు అతడు
అడవికి సింహం
పరుగుకు చిరుత
నడకకు పులి
వినయానికి లేడీ అతడు.
రాజు అతడు రాజేంద్రుడు అతడు.!!
ఆకాశానికి రవిరాజు అతడు
భూమికి వెన్నెల రాజు అతడు
విద్యకు మిత్రుడు అతడు
సరస్వతి పుత్రుడు అతడు
ఉన్నత విద్యకు అధిపతి అతడు
రాజు అతడు రాజేంద్రుడు అతడు..!!
కురిసే మేఘమాతడు
పారే నది అతడు
జారే జలపాతం అతడు
నిశ్శబ్ద సంద్రం అతడు
ప్రభుత్వ ముద్ర అతడు
తెలంగాణ ముద్దుబిడ్డ అతడు..!!
=================================
ఆగస్టు 10. ఉన్నత విద్య సంయుక్త సంచాలకులు
ప్రొఫెసర్ డిఎస్ఆర్ రాజేందర్ సింగ్ పుట్టినరోజు శుభాకాంక్షలు.
31 ఆగస్టు పదవి విరమణ శుభాకాంక్షలు............
=============================
డా ప్రతాప్ కౌటిళ్యా
విశ్రాంత అధ్యాపకులు పాలెం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి