రాజాం పట్టణానికి చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత పెంకి గౌరీశ్వరరావు మృతి పట్ల జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతల సంఘం సంతాపం తెలిపింది. సంఘం జాతీయ అధ్యక్షులు చౌధరి రాధాకృష్ణ, ఉపాధ్యక్షులు డి.ఎ.స్టాలిన్, కార్యవర్గ సభ్యులు కుదమ తిరుమలరావు, అలిగి ధూళికేశ్వరరావు, వి.ఎస్.ఎస్.ప్రసాద్ లు గౌరీశ్వరరావు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గౌరీశ్వరరావు సతీమణి చిన్నమ్మలు, కుమారులు చైతన్య కుమార్, జ్యోతిబసు, సోదరుడు వెంకటరావులను, రాజాం లో వారి స్వగృహంలో కలిసి పరామర్శించారు. విద్య, సాహిత్య, కళా, సామాజిక రంగాల్లో గౌరీశ్వరరావు చేసిన సేవలను ఈ సందర్భంగా వీరు ప్రస్తుతించారు.
గౌరీశ్వరరావు మృతికి సంతాపం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి