నిండు పున్నమిలో కానరాని వెన్నెల...: - .. నాగమణి రావులపాటి...


నిండు పున్నమి వెలుగులో
ఆకాశం అంతా వెండి తుఫానులా మెరిసింది...

ఏదో మూలన కానరాని వెన్నెల 
ఓ కథలా దాగి వుంది...

గాలి తాకిడిలో తడుముకుంటూ 
చెట్టు చాటున దాక్కున వెలుగు...

మనసు మడతల్లో నిశ్శబ్ధంగా
అడుగులు వేస్తూ సాగుతోంది...

చూసినంత వెలుగు కాదు జీవితం 
చూడాలని ప్రకాశమే లోతైన సత్యం...

అది కనులకు కనిపించదు
కానీ హృదయానికి మార్గం చూపుతుంది...

నిండు పున్నమి నడుమ 
చీకటి చారలా నిలిచిన ఆశ...

కానరాని వెన్నెలై
మనలోనే మెల్లగా పుడుతుంది...

ప్రపంచం వెలుగుతో నిండినా 
మనసు గ్రహించిన కాంతినే నిజం..‌

నిండు పున్నమిలో కూడా కానరాని వెన్నెల
నా మనసును తడుముతోంది తన స్పర్శతో...

కామెంట్‌లు