గద్వాల సోమన్నకు "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి" జాతీయ పురస్కారం
 



నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్నను "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జాతీయ పురస్కారం వరించింది.ప్రతి ఏటా విద్యాప్రదాత,విశ్రాంత అధ్యాపకులు స్వర్గీయ శ్రీ ముప్పవరపు వెంకటేశ్వరావు, స్వర్గీయ శ్రీమతి ముప్పవరపు ఆదిలక్ష్మి తల్లిదండ్రుల పేరిట యం. వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి కుమారుడు ఆ సంస్థ చైర్మన్ శ్రీ యం.లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి శ్రీమతి యం. విజయ లక్ష్మి దంపతులు, విచ్చేసిన ప్రముఖుల చేతుల మీదుగా ఈ  ప్రతిష్టాత్మక అవార్డు రోటరీ క్లబ్, నెల్లూరులో అందుకున్నారు. అలాగే సోమన్న "ప్రసన్న వదనం" మరియు "చెంగల్వ పూదండ పుస్తకాలు ఆవిష్కరించి, సభకు పరిచయం చేశారు.అచిర కాల వ్యవధిలో శతాధిక పుస్తకాలు(106) వ్రాసి ముద్రించిన విషయం అందరికీ విదితమే.బాలసాహిత్యంలో  "బాల గేయ బ్రహ్మ"  గద్వాల సోమన్న  అవిరళ కృషికిగానూ  ఈ పురస్కారము ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సినీ, సీరియల్ నటుడు యం. మోహన్,ఆరెకటిక నాగేశ్వరావు,బొగ్గరపు రాధాకృష్ణ, సుబ్బయ్య, ఆదినారాయణ రెడ్డి మరియు ఎందరో మహానుభావులు పాల్గొన్నారు.ప్రతిష్టాత్మకమైన పురస్కార గ్రహీత గద్వాల సోమన్నను తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు అభిందించారు.
కామెంట్‌లు