తలగడ నేస్తం.: - పాలగుమ్మి జ్యోతి.


విరహంలో ప్రియురాలై నలిగి నీరసపడ్డ సుకుమారి! 
విరసంలో శరములా దూసుకొచ్చే కయ్యాలమారి! 
విషాదంలో కన్నీటి మూగ గాధలు ఆలకించే సహోదరి!
నిద్రాదేవికి స్వాగతం పలికే రాకుమారి! 
రంగుల స్వప్నలోకాలకి తీసుకెళ్ళే సొగసరి ! 
వర్ణ వర్ణాల,పువ్వుల  గలీబులు తొడిగిన సింగారి!

సోఫాలెక్కిన సోయగాలు!
దివాన్ల పైన దర్జాలు!
ఖవ్వాలి ప్రదర్శనలో హొయలు!
వృద్ధుల కాళ్ల నొప్పులు తగ్గించే సాధనాలు! 

లాప్టాప్ ల బరువులు మోస్తూ...
పిల్లలు విసిరే బంతిలా ఆటల్లో ఉత్సాహ పరుస్తూ.. 
చరవాణిని తిలకించే లలన ఎదపొంగులుతాకి మురుస్తూ...
పాపల నిదురలో ఇరువైపులా బంటులా కావలికాస్తూ..
భయపడే బుజ్జాయిలను గుండెలకు హత్తుకొని భరోసానిస్తూ..
తలగడ నేస్తమా!
ఆత్మీయ బంధమా!
నిను వీడుట సాధ్యమా!
కామెంట్‌లు