కల సాకారమైన వేళ : - కవిమిత్ర, సాహిత్యరత్న -ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ - (పుష్యమి)-సెయింట్ లూయిస్- అమెరికా.

 

 స్వాతంత్య్రమే  నా జన్మ హక్కు అన్న 
లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ప్రేరణతో 
విద్యలకు నిలయమైన విజయనగరంలో
పాఠశాలలో చదివే రోజులలోనే 
విదేశీ వస్తు బహిష్కరణలో పాల్గొని
మహాత్ముని పిలుపుతో ఖాదీ వస్త్రాలనే  
జీవితాంతం ధరించి తెన్నేటి , ప్రకాశం పంతులకు 
సన్నిహితుడై 
సహకార సంఘ పితామహునిగా 
రైతు శ్రేయస్సు కొరకు పాటుపడి 
మహాత్ముని విశాఖపట్నం టౌన్ హాలులో కలిసి 
ఆశీస్సులు పొంది 
స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుంచి 
స్వాతంత్ర్య దినోత్సవం గణతంత్ర దినోత్సవ సమయంలో
ఓపిక లేక పోయిన పండుగలు చేసుకోకపోయినా
తప్పక సోదరుడు పింగళి వెంకయ్య రూపొందించిన
త్రివర్ణ జాతీయ పతాకాన్ని 
నేను కన్న కల సాకారమైన వేళ అని
వణికే చేతులతో వినీల గగనాన ఎగురవేసి 
జాతీయ గీతాన్ని ఆలపించిన 
నా పితృదేవులు పూర్ణయ్య పంతులుగారు 
నాకే కాదు ఉత్తరాంధ్రకే స్పూర్తి 
వారికివే నా అక్షరాంజలులు...!!
...............................

కామెంట్‌లు