నిన్ను నీవే మలుచుకుంటూ...: - బి.ఉషారాణి-మంచిర్యాల


చిన్న చిన్న అడుగులతోనే
నీ ప్రయాణం మొదలవుతుంది
పెద్ద పెద్ద లక్ష్యాలను చేరుకునే దిశగా
నిన్ను ముందుకు నడిపిస్తుంది

పడిపోయానని ప్రయత్నం ఆపకు
తగిలిన గాయాలను చూసి వెనుతిరగకు
కష్టం వచ్చిందని కుమిలిపోకు
కన్నీరు కారుస్తూ నిలిచిపోకు

పడిన ప్రతిసారి లేచి నిలబడు
ఓటమిని సోపానంగా మలచుకుని
ఒక్కో మెట్టు అధిరోహించు
ప్రయత్నం ఆపక ధైర్యంతో నడువు

నీ సంకల్పం దృఢంగా ఉంటే,
విజయం నిన్ను తప్పక వరిస్తుంది
నీపై నీకు పూర్తి నమ్మకముంటే
నీ ప్రతి కల నిజమవుతుంది

నీ ఉన్నతికి ఆకాశమే హద్దు
నీ ప్రయత్నం ఆపద్దు ఏ పొద్దు
నిజాయితీతో ముందుకు సాగు
నిర్భీతితో వేయి అడుగు

నిన్ను నీవే తెలుసుకుంటూ...
నిన్ను నీవే మార్చుకుంటూ...
నిన్ను నీవే మలుచుకుంటూ...
నిన్ను నీవే గెలుచుకుంటూ...
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
👌👌