వర్షములు కురిపించి బాసటగ నిల్చునవి.
వరదలు నివారించి ప్రాణములు నిల్పునవి
ఫలసాయమందించు వనరుగా నిల్చునవి.
ఔషధంబుగ మారి యారోగ్య మిచ్చునవి.
పలువిధంబుగ ధరకు ప్రయోజనకారులివి.
జీవజాలము కెల్ల చేవకలిగించునవి.
ప్రాణవాయువు నొసగి బ్రతుకు కాపాడునవి.
నీడనిడు వృక్షములు నిల్పు జవజీవములు.
ఆధారమై జనుల కాహారమిచ్చునవి.
దేవతారూపములు దివ్యమౌ శోభతో
నలరారు చున్నవిట నవనికే మిత్రులట.
ధనముకోసము నేడు తరువులను కాల్చగా
చేటుకల్గును భువికి చింతమిగులును తుదకు.
పాదపంబుల పెంచి వసుధనే రక్షించు
జీవరాశికి మేలు చేయగా తలపెట్టు.//
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి