అలల పలకరింపు.: - పాలగుమ్మి జ్యోతి.


సముద్రపు తీరమున 
 ఆడిరి పిల్లలు ఇసుకన 
 గూళ్ళు కట్టిరి వేగాన 
 అలలు చెరిపాయి ఠక్కున!

 రంగురంగుల రాళ్ళు 
 ఆల్చిప్పలతో సందళ్ళు 
 గవ్వల కోసం జల్లెళ్ళు
 శంఖాలకై వెతికెను కళ్ళు!

 అలలు తాకాయి పాదాలు  
 గుఱ్ఱం పైన స్వారీలు 
 పడవలపై ప్రయాణాలు
 చాకచక్యంగా  బేరాలు!

 గోలి సోడా కుయ్ కుయ్ లు 
 ముంత మసాలా రుచులు 
 పుల్ల ఐసుకై పరుగో పరుగులు
 తిన్నారు శనగలు పునుగులు! 
 

 ఆడి అలసిన పిల్లలు 
 సెలవు చెప్పాయి అలలు 
 మరలా రమ్మని పిలుపులు 
 వస్తామంటూ వాగ్దానాలు!
కామెంట్‌లు