జిత్తుల మారిచిలక : - కలకుంట్ల జలజ రావు.: రచయిత్రి, కవయిత్రి, ఉపాధ్యాయురాలు.
 

ఒక అడవి, ఆ అడవిలో రకరకాల చెట్లు ఉన్నవి కానీ ఆ అడవిలో ఒక పెద్ద జామ చెట్టు ఉంది. ఆ చెట్టు అంటే అడవిలోని జంతువులకు పక్షులకు చాలా ఇష్టం దాని పండ్లు తియ్యగా ఉంటాయి. చెట్టు పెద్దగా ఉండటంవల్ల దాని నీడ చల్లగా ఉంటుంది. అయితే ఆ చెట్టు పండ్లు తినడానికి ఏ పక్షులు ధైర్యం చేసి ముందుకు వచ్చి తెంపి తినేవి కాదు. ఆ చెట్టు యజమాని డేగ, దాని మిత్రులు చెట్టు వద్దకు వచ్చి తింటూ ఉండేవారు. కొందరు భయంతో అడిగి తెంపుకునేవారు, చిలక ఎన్ని పండ్లు తెంపిన డేగ ఏమీ అనక పోయేది.చిలక అన్ని పండ్లు, కాయలు తెంపుతూ పడేసేది. కొమ్మలను విరిచేది. సగం తిని అంటూ, ఇటు పడేస్తూ ఉండేవి. అలా చేయడమే కాక ఇతర పక్షులు చేస్తున్నవని చాడీలు చెప్పేది..డేగ ఆ మాటలు విని ఇతర పక్షులను కోపం చేసేది. డేగకు తెలియకుండా ఆ చెట్టు పండ్లు తీసుకుని డేగ కు విరోధం ఉన్నవాళ్లకు ఇచ్చేది. ఏమీ తెలవనట్లు ఉండేది. గువ్వలు, పిచ్చుకలు, పావురాలుచెట్టుపై ఉంటే వాటి మీద చాడీలు చెప్పి రాకుండా చేసేవి. చిలక ఏది చెప్తే అది వినేది డేగ, కాని చెట్టు గురించి ఆలోచించేది కాదు డేగ. కొన్ని రోజుల తర్వాత ఆ చెట్టు వద్దకు ఎవరు వెళ్లడం లేదు. ఆ చెట్టు పండ్లను వద్దనుకున్నారు. అన్నిపక్షులు కూడ చెట్టు వద్దకు  వెళ్లలేదు. డేగ మనమాట వినదు ఏదో ఓ రోజు ఆ చిలక నిజస్వరూపం తెలుస్తుందని ఆ పండ్లు వద్దు, ఆ చెట్టు నీడ వద్దని అనుకున్నాయి…
        
కామెంట్‌లు