ఊషన్నపల్లి పాఠశాలలో పిల్లలకు ఉచిత షూలు పంపిణి
 

-- సర్పంచి, ఎంఈఓ చేతుల మీదుగా అందజేత
-- ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన, నాణ్యమైన విద్య అందుతుందని వక్తల ఉద్ఘాటన.

 కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం గంగారం గ్రామ సర్పంచి రేకుల జ్యోతి రఘు, ఉప సర్పంచి మేడి అశోక్, ఎంఈఓ సిరిమల్ల మహేష్, కాంప్లెక్స్ హెచ్ఎం వెంకటేశం, చైర్మన్ పెండ్లి స్వరూప, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్యలు పిల్లలకు ఉచిత షూలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచి జ్యోతి, ఎంఈఓ మహేష్, కాంప్లెక్స్ హెచ్ఎం వెంకటేశం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలతో పాటు మెరుగైన, నాణ్యమైన విద్యను అందిస్తున్నారని, ప్రజలు, పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యా సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి విద్య కంటే అధికమైన విద్యా ప్రమాణాలతో అత్యుత్తమ విద్యా ఫలితాలు సాధిస్తున్నామన్నారు. ఇందుకు నిదర్శనం ఊషన్నపల్లి పాఠశాలకు  రెండుసార్లు జిల్లా ఛాంపియన్ స్కూల్ అవార్డు వచ్చిందన్నారు. రెగ్యులర్ గా పాఠశాలకు హాజరవుతూ అంకిత భావంతో పనిచేస్తున్న  ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా ఘన సన్మానం జరిగిందన్నారు. గురుకుల, ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థినీ, విద్యార్థులు అందరూ  కూడా అత్యధిక మార్కులతో విజయం సాధించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి రేకుల జ్యోతి రఘు, ఉప సర్పంచి మేడి అశోక్, పంచాయతీ కార్యదర్శి షాబుద్దీన్, మాజీ ఉపసర్పంచి గుడ్ల సంపత్, వార్డు సభ్యులు చిక్కుల వంశీ ఎంఈఓ సిరిమల్ల మహేష్, కాంప్లెక్స్ హెచ్ఎం వెంకటేశం, పాఠశాల చైర్మన్ పెండ్లి స్వరూప, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, మంద శ్రీవాణి, ఎడ్ల స్రవంతి బండారి సరిత, ముసుకు మధుకర్, విద్యార్థినీ, విద్యార్థులు పిల్లల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు