తెలిసేదేవ్వరికి?
ధ్యానంలో దాచిన బాధ
తెలిపేదెవ్వరికి?
కన్నుల్లో నిండిన మెరుపు
కనిపించేదెవ్వరికి?
గుండెల్లో నిలిచిన గెలుపు
అనిపించేదెవ్వరికి?
దారుల్లో దొరికే స్నేహం
నిలిచేదెవ్వరికి?
చేరువలో కోరిన తీరం
దొరికేదెవ్వరికి?
ఊహల్లో ఊరించే గమ్యం
ప్రాప్తించేదెవ్వరికి?
స్వప్నించే కళ్ళకు సత్యం
ఎదురయేదెప్పటికి?
మాయల్లో మునిగిన మనసు
మర్మమెరిగేదెన్నటికి?
గాయంగా మారిన భయం
మాసిపోయేదెన్నటికి?
ప్రతిరోజొక పండగలా
తోచేదెప్పటికి?
ప్రతి ఉదయం హృదయం
వికసించే దెన్నటికీ?
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి