ఆచార్యదేవో భవ: - డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.
 

అపార జ్ఞానాన్ని ఆర్జించినంత ఇచ్చే సహనం,
వెళ్ళాల్సిన దారిని నిర్దేశించే మార్గదర్శకత్వం,
తప్పుల్ని కాచి,కడుపులో పెట్టుకొనే తత్వం,
ఆప్యాయతను అక్షయంగా ఇచ్చే దైవత్వం,
క్రమశిక్షణను పొందికగా నేర్పే సుశీలత్వం,
సౌజన్యమే చిరునామాగా కల్గిన‌ దాతృత్వం,
సమన్వయమే స్వావలంబనగా సమకూర్చే పితృత్వం,
లాలనతో,ఆశీర్వాదాలతో అభివృద్ధిని ఇచ్చే మాతృత్వం,
తోడు,నీడగా ఎప్పుడూ నిలబడే మితృత్వం,
తానొక నడయాడే విజ్ఞానసర్వస్వంగా కనబడే వ్యక్తిత్వం,
శీలమే ధనంగా సంభావించే ఆత్మగౌరవం,
గురువే గుర్తుగా మిగిలిపోయేటి   జ్ఞాపకం,
అజ్ఞాన తిమిరాలను దూరం చేసి,
జ్ఞానకాంతులను అవిశ్రాంతంగా నింపెడి ఋజుత్వం,
జీవితాన తానొక సువర్ణాధ్యాయం.
కామెంట్‌లు