కాళ్ళకు గజ్జలు కట్టండి
కోలాటానికి నడవండి
లయబద్ధంగా ఆడండి!!
ముస్తాబైన బుట్ట బొమ్మలు
చేతిన పట్టి రెండు కఱ్ఱలు
కోలాటానికి తీసె పరుగులు
పండుగలో చేసే సందడులు!!
పదగురు ఆడే కోలాటం
చూచుట ఎంతో ఉత్సాహం
కిలకిల నవ్వుల నర్తనం
చేసిరి జనులను సమ్మోహనం!!
రంగురంగుల తాళ్ళతో
జడ కోలాటం ఆటలతో
ఆడిరి ఎంతో నేర్పుతో
వేడుక ముగిసెను ఘనతతో!!
=======================

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి