నిదురించిన నిశ్శబ్దంలో నీ ఆగమనం...
చీకటి మేఘాల మధ్య వెలిగిన వెలుగు
మనసుకు ఊరట నిచ్చే నీ రూపలావణ్యం...
చిన్న చిన్న ఆశల గుండెల్లో పొంగి
విరహం తడిసిన కన్నీటి జలంలో అలిగి...
నక్షత్రాల పాటలలో ఈ మౌనం వినిపిస్తుంది
పల్లకీలో అలంకరించిన పూల సుగంధంలా...
విరిగిన కలల తీరంలో నీపాటల ఆలాపన
నా మనసును మెల్లగా ఆకట్టుకుంటుంది...
స్వప్న తీరంలో అలలు చిలకరించే
ఆ చిరుజల్లులు నాకవి పలకరింపులు...
నీ అనురాగపు పరిమళం నీ స్మ్రతులకు
మధురమైన ఆనందపు తేనె తలపులు...
ఇది స్వప్నమో సత్యమో లేక మాయనో
ఎదురు చూపుల్లోనూ కన్నీరు చేరింది...
ప్రతిరాత్రీ నా కవితలోని హాస్యం
నన్ను ఎగతాళిగా చూస్తోంది...
ఓ స్వప్నమా నీ నిశ్శబ్దం నాకు ఆమోదం
కన్నీటి తడి లోను కలల వర్షం...
మరువరాని వేళల్లోనూ నీ రూపం
అంతిమ రాగంలోనూ మెల్లగా వినిపిస్తుంది...
నీ కలల వనంలోనూ నన్ను నడిపించే
నీ చిరునవ్వు నాకు పిలుపునిచ్చింది...
కాలపు ప్రవాహంలో కలిసిపోతున్నా
నీ స్మృతి నన్ను పట్టుకుని నిలిపింది...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి