కోడేరు మోడల్ స్కూల్లో పీఎం శ్రీ అవగాహన సదస్సు
 

 తెలంగాణ మోడల్ స్కూల్‌ కోడేరులో పీఎం శ్రీ కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పి. శివకుమార్ సింగ్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ అధ్యాపకులు, విద్యార్థులతో సుమారు రెండున్నర గంటల పాటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
విద్యా విధానం, క్రమశిక్షణ, ఓపిక, సహనం, లక్ష్య సాధన వంటి అంశాలపై విద్యార్థులకు ఆయన వివరించారు. విద్యతో పాటు సామాజిక అంశాలు, భారతీయ సంస్కృతి, విజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. వివిధ ఉదాహరణల ద్వారా విద్యార్థులకు విషయాలను సులభంగా అర్థమయ్యేలా వివరించారు.
అలాగే పరిశోధన విద్యార్థులు మహిళల భద్రత, జాగ్రత్తలు, సామాజిక బాధ్యత వంటి అంశాలపై అవగాహన కల్పించారు. గంగోత్రి పరిశోధన విద్యార్థులు విద్యార్థుల శరీర పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాఘవేందర్, అధ్యాపకులు, పరిశోధన విద్యార్థులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కామెంట్‌లు