వాడుతారు నన్ను వాడజాల నేను.: - డా.సి.వసుంధర.


రోజ్ 
 రోజ్ రోజ్ రోజపువ్వా
నువ్వు వాడిపోతే
వీడిపోతావ్ ,రాలిపోతావ్

నన్నచూడు నాఅందముచూడు
వాడను వీడనుకుండివదలను.
దండిగా ఉండి 
రండి రండని అందరిని ఆకర్షిస్తా.

తలలోవెలిసి తళుక్కున మెరిసి,
వికసించి సదా వెదజల్లుతా అందాలు, వాసనలేనిపువ్వు.....అన్నపద్యం
 ఎప్పుడో మరిచారు ప్రజలు. 
అందుకే దాల్చారు నన్ను శిరస్సున.

శుభకార్యాలకు శోభను నేనే,
టేబుల్ మీద రాణి నేనే.
పెళ్లికూతురిజడలో నేనే

అది ఇది ఏమని అన్ని చోట్ల పూల చెట్లతో 
పని లేకుండా నీరు ఎరువు , శ్రమలేకుండా
శతపత్ర వికసిత వదననై
 అందం చిందే 
కుసుమం నేనే 
పూచివాడి పోయే మీపువ్వుల కాలం ముగిసిందమ్మా 
 ఇది ప్లాస్టిక్ యుగం, జగమంత మాదే 
రాజ్యం .

చిత్రం భళారే విచిత్రం మనుషులు కూడా మారిపోయారు 
మా ప్లాస్టిక్ ఫ్లవర్సలాగానవ్వులు చిందుతూ
ఆప్యాయతఅనురాగాల సుగంధాలు గంగలోకలిపేశారు. 
వారికి మేము మాకు వారు బంధువులు.
 ఓ🍁
రోజా పువ్వా!
నువ్విక రువ్వకు నవ్వులను
నీ దవ్వుల కెవ్వరు
రారికను.
🍂🍂🍂🍂🍂
🌺🪨🐚🪴🌹🍄🌷🌺
కామెంట్‌లు