గోవర్ధన పూజ: - - యామిజాల జగదీశ్


 వ్రజభూమిలో గోవర్ధన పూజ పండుగను ఎంతో ప్రేమ, భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. విశాలమైన గోవర్ధన గిరిని పూలు, దివ్వెలతో అందంగా అలంకరించారు. వ్రజవాసులు, ఆవులు, దూడలు ఒకచోట చేరి అన్నకూటం నైవేద్యాన్ని సిద్ధం చేశారు.
అప్పుడే భక్తులందరికీ ఒక అద్భుతమైన దివ్య దర్శనం లభించింది. స్వయంగా శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమంత పెద్ద రూపంలో ప్రత్యక్షమై సమర్పించిన నైవేద్యాన్ని, వారి ప్రేమను స్వీకరిస్తున్నాడు. బాలకృష్ణుడు చేతులు జోడించి ఆ దివ్య రూపాన్ని దర్శించుకున్నాడు. నలువైపులా "గోవర్ధన మహారాజ్ కి జై", "శ్రీకృష్ణ భగవాన్ కి జై" అనే జయజయధ్వనులు మిన్నుముట్టా యి.
ఈ దృశ్యం వ్రజవాసులందరి హృదయాల్లో ప్రేమ, భక్తి, భగవంతుని అనుగ్రహానికి ప్రతీకగా నిలిచిపోయింది. 
కామెంట్‌లు