కర్తవ్య బోధన.....!!: - " కావ్యసుధ "


పదిమంది ఒకచోట కూడి 
కాకుల్లా అరవడం కాదు.
కర్తవ్య బోధన చేయాలి !
మాటలతో కాదు....... చేతలతో
 భారతాన్ని నిలబెట్టాలి !!

జెండా ఎగరేసి ఫోటో తీయడం కాదు
జెండాకు కలంకం రాకుండా చూడాలి
నినాదాలు ఇవ్వడం కాదు 
నినాదాలను బ్రతికించాలి 

కులం లేదు....మతం లేదు
మనమంతా మానవ మతం
మనమంతా భరతమాత బిడ్డలం 
అని స్టేటస్ పెట్టడం కాదు
ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టు 
అదే నిజమైన మానవ మతం

త్యాగధనుల ఫలం ఇది 
దేశానికి బలం ఇది
అని ఉపన్యాసం ఇవ్వడం కాదు 
అవినీతిని ఎదిరించాలి 
సోమరితనాన్ని తరిమికొట్టాలి
అక్షర జ్యోతి వెలిగించాలి
అమరవీరులకు అదే నిజమైన నివాళి
కదలాలి ప్రతి కవి కలం 
భరతమాతను కీర్తిస్తూ...
జై.....భారత్ మాత !
జై...జై...భారత్ మాత !!
నీ కీర్తి హిమాలయ శిఖరం 
అది మాకు స్ఫూర్తి కావాలి
నీ బిడ్డల కర్తవ్యం...
దానిని అందుకోవడం.

ఓ భారతీయుడా...!!
స్వాతంత్రం అంటే సెలవు కాదు 
స్వాతంత్రం అంటే శ్రమ
స్వాతంత్రం అంటే శపథం.
======================
" కావ్యసుధ "
''వాజ్ఞ్మయ భూషణ''
" సాహితీ శిరోమణి "
 హైదరాబాద్
 9247313488
కామెంట్‌లు