80 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో "సలాం సైనికా!" త్రిభాషా కవితా సంకలనం ఆవిష్కరణ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పరమవీరచక్ర గ్రహీతలు,వీర సైనికుల త్యాగాలను స్మరిస్తూ "అక్షరయాన్" సంస్థకు చెందిన కవయిత్రుల బృందం రూపొందించిన "సలాం సైనికా!" కవితా సంకలనం 80 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లోని వార్ మెమోరియల్ వద్ద ఘనంగా ఆవిష్కరించారు .
"అక్షరయాన్" అధినేత్రి అయినంపూడి శ్రీలక్ష్మి గారి ఆధ్వర్యంలో మేజర్ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా,ఇతర ఆర్మీ అధికారుల సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వందనం,త్రివిధ దళాల వందనం తరువాత ఈ త్రిభాషా కవితా సంకలనం ఆవిష్కరణ జరిగింది.
ఈ సంకలనంలో చంద్రకళ.దీకొండ హిందీభాషలోకి అనువదించిన "అజాత శత్రు నాయక్ జదునాథ్ సింహ్* కవితకు కూడా స్థానం లభించింది.
80 వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర సైనికులకు కవయిత్రులు అక్షరనివాళిని అందించే అపురూపమైన కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని కలిగించిందని,ఈ సువర్ణావకాశాన్ని అందించిన అయినంపూడి శ్రీలక్ష్మి , విశ్వైకకు చంద్రకళ.దీకొండ కృతజ్ఞతలు తెలపడం జరిగింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి