పత్రికా స్వేచ్ఛకు పాదులు తీసిన
ధీరత్వం,
నిజాన్ని నిర్భయంగా వెల్లడించే సాహసం,
నవాబుల పాలనపై నిఖార్సైన వార్తలు వ్రాసే బాధ్యత,
రైతుల బాధల నెరిగి కలం నడిపిన కృషీవలత్వం,
తెలుగు సాహిత్యానికి సొబగులు
అద్దిన పరిశోధకత్వం,
సాహిత్యగోష్ఠుల జరిపి కవుల
రచనలకు మార్గదర్శకత్వం,
తెలంగాణ కవులను వెలికిదీసి
ప్రతిష్ఠను పెంచిన సంపాదకత్వం,
చరిత్రకు బాసటగా నిలిచి ప్రామాణికతను సంతరించిన సృజనాత్మకత,
గ్రంథాలయోద్యమానికి మద్దతుగా నడిచిన దార్శనికత్వం,
వివిధ ప్రక్రియలతో సాహిత్యసంపదను వృద్ధి పరచిన
రచనావ్యాసంగం,
సురవరం మద్రను వేసిన అచ్చతెలుగు ఆహార్యం,
పంచెకట్టుతో పరిమళించిన మానవత్వం,
ఆత్మగౌరవానికి పట్టిన దర్పణం,
భాషకు పట్టం కట్టి బ్రతికించిన నైపుణ్యం,
ప్రతాపరెడ్డి గారి అపూర్వ వ్యక్తిత్వం.
గోలకొండ కవుల సంచికతో పౌరుషాన్ని చూపి,
హిందువుల పండుగలతో చైతన్యాన్ని రగిలించి,
ఆంధ్రుల సాంఘిక చరిత్రతో సాంస్కృతిక పునరుజ్జీవనానికి కృషిసల్పి,
వ్యాసాలు,కథలతో తెలుగుసాహిత్యాన్ని సుసంపన్నం చేసారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి