రాధాకృష్ణులు: - యామిజాల జగదీశ్
 

రాధాకృష్ణుల దివ్య చరణాలు మనస్సును భక్తి, ప్రేమ, శాంతితో నింపుతాయి. ఈ పవిత్ర చరణాల్లో అందమే కాదు... ప్రేమ, సమర్పణ, విశ్వాసాల అనంత భావం దాగి ఉంది. భక్తులు తమ మనసులోని చింతలు, బాధలు, కోరికలు శ్రీ రాధాకృష్ణుల పాదాల దగ్గర అర్పించినప్పుడు, హృదయానికి అద్భుతమైన శాంతి లభిస్తుంది.
రాధాకృష్ణుల దివ్య చరణాలు స్వచ్ఛమైన ప్రేమ, భక్తి, ఆత్మసమర్పణలకు ప్రతీకలు.  నిజమైన సంతోషం లౌకిక విషయాలలో ఉండదు; మన కలవరాలను దేవుని పాదాలకు వదిలేసి ప్రశాంతంగా ఉండటంలోనే ఉందనే ఈ పాదాలు గుర్తుచేస్తాయి.
శ్రీ కృష్ణుని చరణాల్లో ప్రేమ ఉంటే, రాధారాణి చరణాల్లో కరుణ, వాత్సల్యాల సాగరం ఉంది. భక్తునికి ఈ ఇద్దరి పాదాలే జీవితంలో అత్యంత అందమైన ఆధారం. సచ్ఛమైన శ్రద్ధ ఉన్న చోట ఖచ్చితంగా దేవుని కృప లభిస్తుంది.
ఈ దివ్యమైన భక్తి ఘట్టాన్ని చూసిన తర్వాత మనస్సు ప్రశాంతంగా అనిపిస్తే, ఒక క్షణం కళ్లు మూసుకుని రాధాకృష్ణులను ప్రేమతో తలుచు కోవాలి. ప్రతి చింతను, భయాన్ని, సమాధానం లేని ప్రశ్నలను వారి పవిత్ర చరణాల దగ్గర ఉంచేయాలి.
'రాధా రాధా' అనడం కేవలం ఒక పేరు జపించడం మాత్రమే కాదు, మనస్సు ను ప్రేమతో, భక్తితో ముడివేసుకోవడమేసుమీ!!
కామెంట్‌లు