సామెత -315: ఇత్తొకటేస్తే చెట్టొకటి మొలుస్తదా
"అవ్వా !అవ్వా! గియ్యాల మా బల్లె ఏమైందో తెల్సునా! గియ్యాల మా లెక్కల సారు యిశాలన్నని మస్తు తిట్టిండు పో.అచ్చం గీడు గాని అయ్య నోట్లె నించి ఊడిపడ్డడు. గంతే గాదు అయ్య జుట్లెనించి ఎల్లిండు" అని పక్కనున్న సార్లకు సుత శెప్పిండవ్వా. "
"అవునానే భూలచ్మీ! గా సారు గన్ని మాటలెందుకన్నడు. అయితే గా యిశాల్ గాడు మస్తు బాదవడ్డడా" అయినగని గాని అయ్య ముచ్చెటి ఎందుకొచ్చిందో?"
"అవ్వా! గా అన్నోళ్ళ నాయిన సుత సారు కాన్నే సద్విండంట. సారు గా అన్నని సూశినప్పుడల్ల అచ్చం గీని అయ్యొతికెనే వుండు. ఒక్కపాలి ఆడే ఈడా ఏందని ఆశ్చిర పోతుంట అనంగ మేవుఁ శానా త్యేపల ఇన్నమవ్వా!''
"గదానే సంగతి.గందుకే అన్నడా. మరెగని గీడు వాళ్ళ నాయిన లెక్క ఏం జేసిండట?"
" గా అన్న పాఠాలు రాస్కునే వొయ్యి, లెక్కలు జేస్కునే వొయ్యి ఉంటది గద గందుల్ల సార్లు పంతులమ్మలు శెప్పింది రాయమంటే గిలిపి గిలిపి శీమ కాళ్ళ లెక్కన అయిదు కమ్మల పాఠము ఒక్క కమ్మల యిరికిత్తడు. గయ్యి సూడ్డానికి సార్లు పంతులమ్మలు కండ్ల జోళ్ళు గదే అవ్వా! నువ్వు సులోచనాలు అంటవు సూడు గవి కిందికి మీదికి జర్పుకుంట సద్వలేక అవత్త పడుతుంటరు. లెక్కలైతే ముందేముందో? ఎన్కాతల ఏముందో? అర్తం కాక తల్కాయలు పట్టుకుంటున్నరు గిప్పటికి సుత."
"ఒరేయ్!విశాల్ గా! నీ పేర్ల గంత యిశాలం ఉంది గని.నీ రాతల్ల శేతల్ల రాలేదేంటిరా? ఒరేయ్ పెద్దగ రాయిరా. నీ ఒక్కలి వొయ్యి సూసుట్లనే సయిమమంత అయిపోతుంది.'ఇంగేం దిద్దత'. అని దినాం ఒక్క పాలైనా అంటుంటరవ్వా!"
"'అవునానే! లచ్మీ? గాని అయ్య శిన్నప్పుడు శెడ్డీలేస్కున్న వొయిసులో మస్తు పీనాశి శెకలు సేశేటోడు. గాని అమ్మ ఏదన్న తింటానికి యిత్తే గానికున్న యినప్పెట్టెల దాస్కునేటోడు. మల్ల గయ్యి కుల్లు ఆసన వొచ్చే దన్క గందుల్నే ఉండేయి.ఆసనొచ్చి గాని అమ్మ తిట్టి గయి తీశి పారేశేది గాడు మొత్తంగ తినేటోడు గాదు పక్కల్లకి బెట్టెటోడు గాదు.గాని బుద్ధులే గీనికొచ్చినట్టున్నయ్!"
"అవునవ్వా! గీ అన్న సుత గట్లనే! పెన్ను, పెన్సీలు,లబ్బరు గిస్మంటియన్ని తెచ్చుకుంటడు గని గయ్యి లాగు కీసలో దాస్కొని దినాం ఒక్కొక్కల్ని అడుక్కొని రాస్కుంటడు.'గదేందన్న నీ తాన ఉంది గద 'అంటే నీకు తెల్వదు శెల్లే! నిన్ను గియ్యాల ఒక్క పాలేగా అడ్గేది.గట్లనే బల్లెవున్నోళ్ళని ఒక్కొక్కల్ని అడ్గి రాసుకున్నంక శివరాకరికి నా తాన వున్నాటితో రాస్కుంట అంటడవ్వా!"
"వామ్మో! గాని తెల్వి తేటలు మామూల్గ లెవ్వు గద.గాని నాయిన సుత గిప్పటికీ గట్లనే శేత్తడవ్వా!''
"ఏంది శెల్లే నువ్వెప్పుడొచ్చినవ్?"
'గింత కల్యమాకు తెంపుక పోదమని వొచ్చిన అవ్వ మన్వరాళ్ళ ముచ్చెటి యినబడి ఎవలా అని శెవులు బెట్టి యింటె తెల్శిందవ్వా! గాడు మల్లేశం కొడుకని.మా ఇంటి పక్కనేగా గాని శకలన్ని గిప్పుడు సుత సూత్తనే వున్నవ్వా! పొద్దుగాల లేశి మా గల్లీలున్న ఐదారిల్లులున్నయి. దినాం ఒకలింటికి సరింగ శాయ్ తాగే సయిమానికి, బువ్వ తినే సయిమానికి వొత్తడు.గట్ల గా తాగే తినే సయిమానికొచ్చిన మడిషిని వొదిలి మనం ఊకెనే ఉండం గద.తాగమని శాయ్ బోశినా తినమని బువ్వ బెట్టినా వొద్దనకుండ సుబ్బరంగా తాగి,తిని పోతడవ్వా! గాని కొడ్కు.గదే యిశాల్ గాడు సుత అయ్య లెక్కనే తయారయ్యిండు. గీ యిష్యం బల్లె సార్లు పంతులమ్మల దాక పాకిందన్న మాట! భూలచ్మి శెప్తుంటే యిన్న!"
"అవును శెల్లే! "ఇత్తొకటేత్తే శెట్టొకటి మొలుత్తదా" శెప్పు?"
"అవును అవ్వా! మొత్తంగ అచ్చుకాయితం గుద్దినట్టు గానికన్ని అయ్యబుద్ధులే వొచ్చినయ్!అవును మనం ఏ యిత్తనం ఏత్తే గా శెట్టేగా మొలిశేది. గీడు శిన్నప్పట్యాల నుంచి యిచ్చిన తర్పీదు,పుట్కతో వొచ్చిన అయ్య బుద్ధులు అన్ని కల్శినయ్ అవ్వా!"
ఏమో అవ్వా! మీ మాటలు నా తల్కాయలకి ఎక్కట్లే. నేను బుడ్డోడితో ఆడుకుంటానికి పోతన్న."
గదండీ సంగతి! " ఇత్తనమొకటేస్తే శెట్టొకట మొలుస్తదా అంటే గిదే మరి."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి