దారిలో అడ్డు తొలగు
చూసిన పిల్లలు పరుగు
దాన్నోట్లో చెఱకు నలుగు!
సాగర మథనమే జననం
శరీర వర్ణం ధవళం
దాని పేరే ఐరావతo
ఇంద్రుడికదియే వాహనం!
భలే భలే ఏనుగు తొండం
దాని నిండా నింపి జలం
లక్ష్మీదేవికి చేసే అభిషేకం
గజలక్ష్మి ప్రక్కల దర్శనం!
చేసిరి ఏనుగుకలంకారం
ఉత్సవాల్లో గజారోహణం
పిల్లల పెద్దలకాశీర్వాదం
ఇచ్చుట ఏనుగుకాహ్లాదం!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి