కాకులు ; - వరలక్ష్మి యనమండ్ర


కాకులు నల్లని కాకులు 
చెప్తాయ్ మనకవి నీతులు 
కలిసుండాలని బోధలు 
తెలుసుకోండిరా బాలలు 

ఆపద వస్తే అరుస్తాయి 
రారమ్మంటూ పిలుస్తాయి 
గుంపులుగా చేరుతాయి 
కావు కావుమని అంటాయి 

పరిశుభ్రతనే పాటిస్తాయి 
పనిలో శ్రద్ధను చూపిస్తాయి 
పరోపకారం చేస్తాయోయి
ఆహారం పంచుకు తింటాయి 

కలివిడితనము నేర్వరా 
కష్టంలో తోడు ఉండరా 
గుణమును మాత్రం చూడరా 
కాకులు చెప్పే సత్యమిదేరా

కామెంట్‌లు
Chandra Shekar Achen చెప్పారు…
మంచి నీతి మేడం 👌
Chandra Shekar Achen చెప్పారు…
సందేశాత్మక కవిత మేడం 👌