హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి.


హిమాలయం కన్నీరు కార్చి,
 నేపాల్ ఒడిలో విషాదం నింపింది..!

మంచు కొండలు కరిగి కదిలిన వేళ...
మట్టి ప్రవాహం మానవ  గుండెల్ని ముంచింది..!

నిన్నటి వరకు నిశ్శబ్దంగా ఉన్న పర్వతం...
నేడు పెను ప్రవాహమై పరుగెత్తింది..!
చెట్లు, ఇళ్లు, కన్న కలలన్నీ
ఒక్క క్షణంలో నీటిలో కలిసి పోయింది..!

ప్రకృతి కోపమా?
లేక మనం చేసిన తప్పుల ప్రతిధ్వనియా అని ఆలోచన చేయండి..?

పెరుగుతున్న వేడి… కరుగుతున్న మంచు…
రాబోయే ప్రమాదానికి ప్రకృతి హెచ్చరిక అని గుర్తించండి..!

ప్రకృతి పలికిన ప్రళయపు పలుకులు...
మనం వినాల్సిన మౌనపు హెచ్చరికలు.. అందుకే 
ప్రకృతిని ప్రేమిద్దాం
ప్రకృతితో కలిసి జీవిద్దాం..!

లేకపోతే నేడు వరదగా వచ్చిన కన్నీరు
రేపు మన గడపను తడపవచ్చు.

నేపాల్ నేల మళ్లీ నవ్వాలి..!
హిమాలయం మళ్లీ ప్రశాంతంగా నిలవాలి..!
================================
 మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
 చరవాణి 9347042218
కామెంట్‌లు