2006లో డెన్మార్క్‌కు చెందిన అంజా అనే సామాజిక కార్యకర్తకు నైజీరియాలోని ఒక మట్టిరోడ్డుపై రెండేళ్ల చిన్నారి కనిపించాడు. తీవ్రమైన పోషకాహార లోపంతో అలమటిస్తున్న ఆ అబ్బాయిని, అతడి కుటుంబం వదిలేసి వెళ్ళిపోయింది. చేతబడి చేశాడనే మూఢనమ్మకంతో కొందరు పిల్లలను ఇలాగే వదిలేసేవారు. ఐతే అంజా ఆ బాబును చూసి అలాగే వదిలేయలేకపోయింది. వెంటనే మంచి నీళ్లు తాగించి, తనతో పాటు తీసుకెళ్ళింది.
అతనికి అత్యవసర వైద్యం అందించడంతో ఆ చిన్నారి ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. ఆ తర్వాత ఆంజా 'ఆఫ్రికన్ చైల్డ్రన్స్ ఎయిడ్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్' (ACAEDF) అనే సంస్థను స్థాపించి, పిల్లల కోసం ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ బాబుకి 'హోప్' అని పేరు పెట్టి, ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసింది.
2025లో హాప్ తన చదువు పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు. ఒకప్పుడు రోడ్డుపై ఒంటరిగా మిగిలిన ఆ చిన్నారి, ఇప్పుడు ఒక యువకుడిగా మారి, తనను కాపాడిన అంజాతో కలిసి నవ్వుతూ గ్రాడ్యుయేషన్ దుస్తుల్లో నిలబడ్డాడు.
ఆంజా తన సంస్థ ద్వారా ఇప్పటివరకు చేతబడి పిల్లల ఆరోపణలు ఎదుర్కొంటున్న వందలాది మందిని కాపాడింది. వారికి వైద్యం, చదువు, సురక్షితమైన నీడను అందించింది.
ఒక మట్టిరోడ్డుపై అంజా చూపించిన చిన్న ధైర్యం ఒక జీవితాన్నే కాదు, వందలాది మంది పిల్లల భవిష్యత్తును మార్చేసింది.
ప్రేమ, సరైన సమయంలో చేసే సహాయం ఎంతటి అద్భుతాన్ని సృష్టిస్తుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక గొప్ప ఉదాహరణ.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి