ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన అచ్చయిన పుస్తకం విషయానికి వద్దాం...
ఈ రోజుల్లో ఒక పుస్తకాన్ని వేల సంఖ్య లో ముద్రించడం సర్వ సాధారణం.
కానీ 1,100 సంవత్సరాల క్రితం చెక్క దిమ్మలను ఉపయోగించి ఒక పూర్తి పుస్తకాన్ని ముద్రించారు.
ఆ పుస్తకం పేరు “వజ్ర సూత్రం”. ఇది ఒక బౌద్ధ గ్రంథం. తాంగ్ రాజవంశం కాలంలో ఇది అచ్చుకు నోచుకుంది.
దీనిని చైనాలో క్రీ.శ. 868, మే 11న చెక్క దిమ్మల ముద్రణ సాంకేతికతను ఉపయోగించి ముద్రించారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న, తేదీ నిర్ధారించిన అత్యంత పురాతనమైన పూర్తి ముద్రిత పుస్తకం ఇదేనని బ్రిటిష్ గ్రంథాలయం పేర్కొంది.
ఈ పుస్తకం ఒక సాధారణ చిన్న పుస్తకం కాదు. ఇది అనేక కాగితపు షీట్లను ఒకదానికొకటి అంటించి తయారుచేసిన పుస్తకం. ఈ పుస్తకం పొడవు సుమారు 5 మీటర్లు.
ఈ పుస్తకం కేవలం అక్షరాలతో మాత్రమే ముద్రించలేదు. ఈ పుస్తకం ప్రారంభంలో బుద్ధుడు తన శిష్యుడైన సుభూతికి బోధిస్తున్నట్లు వర్ణించే ఒక అందమైన చిత్రం కూడా ఉంది.
ఈ పురాతన పుస్తకాన్ని 1900లో వాయువ్య చైనాలోని డున్‌హువాంగ్ ప్రాంతంలోని మోగావో గుహలలో కనుగొన్నారు.
అక్కడ వేలాది పురాతన తాళపత్రాలు భద్రపరిచారు.
పుస్తకం అంటే కేవలం కాగితం, రాత మాత్రమే కాదు…
ఈ పుస్తకం సంస్కృతం నుండి చైనీస్ భాషలోకి అనువదించిన ఒక పవిత్ర బౌద్ధ గ్రంథం. ఉపయోగించి దీనిని రూపొందించారు.
కాగితం బ్లాక్ ప్రింటింగుతో పుస్తకం వెలువడడానికి పూర్వం ప్రాచీన చైనీస్ గ్రంథాలను దేవవాణి ఎముకలు, తాబేలు పెంకులు, పట్టు తాళపత్రాలు, కట్టిన వెదురు లేదా చెక్క పట్టీల ( జియాన్స్ ) మీద వ్రాసేవారు.
వజ్రసూత్రం పుస్తకం మానవ జ్ఞానాన్ని భద్రపరిచి, తర్వాతి తరానికి అందించే ఒక విలువైన విశేషమైన కాలపు పెట్టె!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి