స్మశానం కూడా నివాసమే శివునికి
ముంచేయడం కూడా మామూలే సముద్రానికి
ఆక్రమించడం కూడా మామూలే గాలికి
ఎదగడం కూడా మామూలే అడవికి
నిలబడడం కూడా మామూలే మహా పర్వతానికి
ఎగరడం కూడా మామూలే పక్షికి
పరిగెత్తడం కూడా మామూలే చిరుతకు
వేటాడడం కూడా మామూలే పులికి
ఈదడం కూడా మామూలే చేపకు...!!
మనిషిగా పుట్టడం మెదడుగా ఎదగడం
మనిషిగా నిలబడటం మనిషిగా ఆక్రమించటం
మనిషిగా ఎగరటం మనిషిగా పరిగెత్తడం
మనిషిగా ప్రశ్నించటం మామూలు కాదు...!!
ఆకాశం ఆశ్చర్యపోయింది
విశ్వం విశ్వసించలేదు ఇది నిజం
మనిషి అవలీలగా శ్వాసిస్తున్నాడు
గుండె అవలీలగా కొట్టుకుంటుంది
ఇది మనిషికి మామూలే.............!!?
==================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా
బిజినేపల్లి మండలం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి