తూరుపు ఎరుపుగా తోచె
పగడపు కాంతులు నిండగ
ధర వెలిగె గగనపు తీరున
పరిమళము పంచుతూ
మారుతము మెల్లగా సాగె
మరందపు ఆశతో గుంపుగా
మధుపములు మోహరించే!
సుమబాలల పలకరించు
తుమ్మెదల గుంపు చూసి
తీగ తల్లికి ఉల్లము పొంగ
తేటి పాటలతో తోట మురిసే
మనసు నిండగ మోదముతో
మధువనము మురిసిపోగా
మకరందపు వాగు వోలె
మదిలోన మమత పొంగె!
చిట్టి కుసుమాల
చిన్ని జీవితమున
ఎన్ని ఉత్సాహాలో
ఎన్ని ఊహల ఊయలలో!
రేపన్నదే లేకపోయి
మాపుతోనే ముగిసిపోయే
విరుల జీవన గానమందు
ఉదయరాగమెంత మధురమో!
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి