వసిష్ట మహర్షి భరత శత్రుజ్ఞలను ఓదార్చుట : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట


తండ్రిని కోల్పోయితిని అన్నకు దూరమైతిని 
ఇక్ష్వాకు మహారాజులు పాలించిన 
ఈ అయోధ్య పాడుబడి పోయెను 
ఇక నేను అయోధ్యలో అడుగుపెట్టను 

నేను జీవించను అగ్నిలో ప్రవేశించెదను 
భరత శత్రాజ్ఞుల శోకమును జూచి
వసిష్టమహర్షి భరతునితో ఇట్లంటాడు 
మీరిప్పుడు దుఃఖించే సమయము కాదు 
 
ఓ భరతా! మీ తండ్రి గారి అస్థికలను 
అస్తసంచయనము చేయల్సి యున్నది 
అందులకు ఆలస్యము చేయుచుంటివేల?
ఆ కార్యములను తొందరగా నిర్వర్తించుము 

ఓ భరతా! ఆకలిదప్పులు, శోకమోహములు, 
జననమరణములు,అను ఈ మూడు ద్వంద్వములను 
సమస్తప్రాణులు పొంది తీరవలసినదే
ఈ విషయమున ఇట్లు శోకించుట తగదు 

భరతశత్రేజ్ఞులు ఊరట చెందినవారై 
వారు పురోహితుల చెంతకు చేరినారు
అస్తిసంచయనాది కార్యములను 
వారిచే అమాత్యులు పూర్తి గావించరి. 

===========================

అయోధ్యకాండమందు77వ సర్గ సమాప్తము🙏🏻
కామెంట్‌లు