డిజిటల్ ఎడ్యుకేషన్..!!: - సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.


మట్టిలో నాటిన విత్తనం కొత్తగా మొలిచినట్లు 
పలకలో దిద్దిన అక్షరాలు మెదళ్ళలో మెల్లిమెల్లిగా
మొలుస్తాయి. 
సూర్యుని చూసీ ఆకు అన్నాన్ని తయారు చేసుకున్నట్లు 
పుస్తకాన్ని తెరచి మనిషి మనసును పారేసుకుంటాడు.
పువ్వు పూసి కాయ కాసినట్లు 
ఊహ పుట్టి ఆలోచన పుడుతుంది. 

అద్దం ముందు నిలబడితే దాని ముందున్నదే కాస్త కనిపిస్తుంది. 
తర్వాత మాయమవుతుంది. డిజిటల్ విద్య కూడా అంతే. 

మస్తీస్కం ఒక పుస్తకం. మస్తీస్కం ఒక పలక బలపం. 
మస్తీస్కం ఒక బ్లాక్ బోర్డు ఒక సుద్ధ ముక్క 
మస్తిస్కం ఒక పెన్ను కాగితం ఒకదాని నొకటి విడదీయలేం.

యంత్రం యంత్రాన్ని అర్థం చేసుకుంటుంది 
యంత్రం యంత్రానికి కనెక్ట్ అవుతుంది. కానీ యంత్రానికి విద్యార్థి కనెక్ట్ అవ్వలేడు. డిజిటల్ విద్య కూడా అంతే.
మనిషికి మనిషే కనెక్ట్ అవుతాడు మస్తీస్కానికి మస్తిష్కమే కనెక్ట్ అవుతుంది. 
మస్తీస్కానికి పుస్తకమే కనెక్ట్ అవుతుంది.

పెన్ను పేపర్ 
పలక బలపం 
సుద్ధ ముక్క బ్లాక్ బోర్డ్ 
మస్తీస్కం పుస్తకం 

ఇదే 
ఆర్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ 
ఇదే 
మదర్ ఆఫ్ ఎడ్యుకేషన్ 
ఇదే 
ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషన్. 

డిజిటల్ ఎడ్యుకేషన్ 
టెక్ ఎడ్యుకేషన్ కేవలం 
ఒక వ్యవహారం ఒక వ్యాపారం..!!!
###############################################################
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
కామెంట్‌లు