జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో శ్రమదానం
  •   ( విద్యార్థులు సేవాభావం అలవరుచుకోవాలి)
        

విద్యార్థులు విద్యార్థి దశనుండే ఉత్తమ లక్షణాలను, సేవాభావంను అలవరుచుకోవాలనీ భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా, సామాజిక సేవకులుగా రాణిస్తారనీ జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి వాసరవేణి పర్శరాములు అన్నారు. 
      ఆగష్టు 11న యెల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు.
ఈసందర్భంగా ప్రోగ్రాం అధికారి వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ, అందులో భాగంగానే ఈరోజు కళాశాలలో పరిశుభ్రతకోసం గడ్డి చెక్కి,చెత్త చెదారం తొలిగించడం జరిగిందనీ అన్నారు. విద్యార్థులు వాలంటీర్లుగా స్వయంగా పాల్గొనడం ద్వారా శ్రమ విలువ తెలుసుకోవడంతోపాటు, శ్రమను గుర్తిస్తారనీ, ఉత్తమ పౌరులుగా రాణిస్తారనీ అన్నారు. 
     ఈ కార్యక్రమంలో కళాశాల ఇంచార్జీ, జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి వాసరవేణి పర్శరాములు, అధ్యాపకులు మాదాసు చంద్రమౌళి, చెరుకు భూమక్క, బుట్ట కవిత, నీరటి విష్ణు ప్రసాద్, జ్యాతోతు శ్రీనివా‌స్, వెల్దండి సౌమ్య, అగోలం గౌతమీ, బోధనేతర సిబ్బంది  కనిమేని దేవేందర్, షాహినా సుల్తానా, నిఖిల్ 100 మంది ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
కామెంట్‌లు