చెప్పలేని ప్రశాంతత
కోనేటి మెట్ల మీద
కోరుకున్న మౌనం
కొండల మధ్య ఏతెంచే
కాంతిమంతుని రూపం
కనుల నిండా నింపుకుంటే
కవితలకందని ఆనందం
రేయి గడిచేదాకా ఆగి
రేకువిప్పిన కమలాలకు
వేయి వెలుగుల రేడు తెచ్చే
వేకువే..... వెలలేని కానుక
అరుణుని ఆగమనమే
అరవిందాలకు పండుగ
కరుణగా తాకే కిరణాలే
కొరతలేని అనుగ్రహం
తెలి వెలుగుల తూరుపులో
వెలిగే జ్యోతి కలశపు
ఒలికిన కాంతి ధారలో
నులివెచ్చని దీవెనలు
వెలుగంత తెల్లగా
మనసంతా పొంగగా
వెలితిలేని సంతోషం
వేకువలో దొరకదా?
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి