సామెత-331: ఇంటల్లుడెప్పుడూ చుట్టమే- శుక్రవారమెప్పుడూ పండగే
**
గీ కాలమేందవ్వా గిర్ర గిర్ర బొంగరం లెక్క , బండిపయ్యె లెక్క తిర్గుతుంది. గా మొన్ననే శావణ మాసమొత్తందని ఇంట్లె ఇంచు సుత వొదలకుండ బూజులు దుల్పితి, బండలు కడిగితి,ఇంటెన్కల పొయ్యి కాడ ఎర్రమన్ను దెచ్చి అల్కి, నావుండల్తొ తెల్లముగ్గుల్నే వెడ్తి,తీనెలు తీత్తి, అమ్మయ్య !ఇంగ పండగ పనిదీరిందని సంబ్రపడితి.గట్ల లచ్చింవారం వొరలచ్మి వ్రొతం జేత్తి."అయ్యిందమ్మ పెండ్లి- అనిగిందమ్మ రంది" అన్కొని ఊపిరి గట్టిగ పీల్సుకున్ననో లేదో ఆరం తిర్గి రానే వొచ్చె. గిప్పుడు పండగ పనులు లెవ్వని పేరేగని అవ్వా! లచ్చింవారం వొత్తుందంటే సాలు పండగంత పని. సేశీ సేశీ రెక్కలు వోతున్నయ్."
"అవును శెల్లే! లచ్చింవారమంటే పండ్గ దినమే శానా మందిర్కి. ఇంట్లున్న యిత్తడి రాగి బోళ్ళు బొచ్చెలు, బిందెలు, శెంబులు ముందలేస్కుని గిస్స గిస్స తోమి మెర్పిచ్చుడో పక్కన, దినం లెక్క గాకుండా ఇల్లు గట్టిగ ఊడ్సుడు తుడ్సుడు ఓ పక్కన దేవునర్రలున్న దేవుండ్లని సుత సుబ్బరం జేస్కొని నైయేజ్జాలు జేసి పెట్టుడు.. పండగ గాదని ఒక్కటే గని పండ్గంత పని శెల్లే! ఇంగ మడి తడి అన్నోల్లింట్ల సూడాలె చెనం దీరదన్కో. నా దోత్తురాలోలింట్లె సూశేదాన్ని గయ్యాల గాళ్ళు తినేతల్కి ఏ మూడో నాల్గో దాటేది. గదేందంటే సుక్కురారం గద గిట్లనే ఉంటది అనేటోళ్ళు. "
" అవునవ్వా!ఇంట్లె పనోళ్ళున్నా , కొనుక్కున్న మిషెన్లు ఉన్నా అస్లోళ్ళకి శాకిరి తప్పనే తప్పదు.
అవ్వా! గీ యిష్యం యిన్నవా? రేకమ్మత్త అల్లుడు వొచ్చిండంట.గీ నడ్మల గాయిన ఉజ్జోగం పనిమీద వోరం వోరం వొచ్చి పోతుండంట. అయిన గని రేకమ్మత్త అడావుడి అడావుడి గాదు పో. ఎందుకట్ల అడావుడి శెయ్యాలె శెప్పు ఎప్పడొచ్చె అల్లుడేనాయె. "
" శెల్లే! అల్లుడు ఎప్పుడొచ్చినా సుట్టంతో సమానమే. మరియాదలు బరాబర్. సుట్టాలకి జేసేవన్నీ అల్లునికి శెయ్యాల్సిందే తప్పదు. గందుకే "యింటల్లుడు సుట్టంతో సమానం" అంటుంటరు."
" గంతేనంటవా అవ్వా! నిత్తెమున్నా వొచ్చిపోయినా అల్లుడు సుట్టంతో సమానం అంటవు. పతి సుక్కురారం పండగే అంటవు.ఇంగ నాకు అల్లుడు రాలెగనవ్వా !గియ్యన్ని సూత్తుంటే, యింటుంటే కడ్పుల బయంజొచ్చి నిద్దర సుత పట్టట్లేదవ్వా! "
ఇగ్గో శెల్లే! నిండ మున్గితే సరే లేదు. ఏదైన సుత మనకి ఎదురైన అనుబవమే పాటం లెక్క అన్ని నేర్పిత్తది. గిప్పన్నించే పికర్ జెయ్యమాకు. గియ్యన్ని మన్తో కాలమే జేయిత్తది.మనం జేసేది జేస్కుంట బోవుడే .
" గంతేనంటవా అవ్వా? "
'అవును శెల్లే! లోకం తీరు గిట్లనె వుంటది.మనకెందుకని వొదిలేస్కొని పోలేం.అన్నిటిని పట్టుకొని ఏళ్ళడ్డమూ లేము."
గదండీ సంగతీ '' ఇంటల్లుడెప్పుడూ సుట్టంతో సమానమే - శుక్లారం ఎప్పుడూ పండుగే అందరికీ".

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి