సామెతల ఊట- సునందమ్మ నోట:- వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 

 సామెత -333: ఇహం మన్ను- పరం పైడి
***
"అవ్వా!ఏందో గీ గుంజాటనలు. మడుసులు ఆత్తి పాత్తులన్కుంట పంచాతీలు.గిండ్లనే ఒకల్నొకలు మోసం శేస్కోడాలూ, పైసల కోస్రం సంపుకోడాలు.నువ్వేమన్న అను అవ్వా! మడుసులు మడుసుల్లెక్క లేరు.ఇంగ గీ బూమ్మీద సావకుండ గిట్లనే బత్కుతరని ఏదేవుడన్న వరమిత్తే బలమున్నోడే గీ పెపంచకంల బత్కేవాడేమో!"
 "అవును శెల్లే! సత్తెం బల్కినవ్! మడుసుల్ల మంచి అస్లే లేకుండ బోతుంది. బందుత్తాలు సుత బర్వై పోతున్నయి. మొన్న టీవిల జూసిన. గంత అన్నేలం పాడువడ్తాది. తొమ్మిది నెల్లు మోశి పుర్టి నొప్పులు బడి గాళ్ళను కన్నంక బత్కంత తేగం జేసి పెంచి పెద్ద జేత్తే ఏంజేసిండో సూశినవా ఒకామె కొడుకు.
"ఏం జేశిండవ్వా! గా తల్లిని అరిగోస బెట్టుకుండా ఏంది?"
"పెట్టుకొనుడొక్కటే కాదు శెల్లే! గాళ్ళు నల్గురు కొడుకులంట ఓ కొడ్కు వొంతు వొచ్చే తల్కి గా తల్లి పానం మంచిగ లేకుండయ్యిందని సూశి గా ముసల్ది సత్తె నచ్చత్రం మంచిగ లేకుంటే ఇల్లు వొదలాల్శొత్తదని ఎవలో శెప్పంగ యిన్నడట.గది కడ్పుల బెట్టుకొని పెంచిన గా కన్నతల్లిని  కాత్తన్న దయలేకుంట ఇంకోని సాయం దీస్కుని బాయిలేశిండట శెల్లే గా తాషుటుడు. గంత పాపం జేశిండు గా పాపిట్టోడు. గాడు గీ పెపంచకంల రోగం నొప్పి లెవ్వకుండ సావు లేకుండ శాశితంగ బతుకుతడ శెప్పు.
 "యెయ్యేళ్ళున్న ఏరు దప్పదు- వొందేళ్ళున్నా సావు తప్పదని శాత్రమే ఉండె గద.గియ్యాల యింట్లె - రేపు మంట్లె అన్నది దెల్వదా గీ మడ్సులకి.
 మన్నుల బుట్టి మన్నుల కల్శే గీ మడ్సులకి మన్నుల గల్శి పర్లోకం పోయినా మిలిగేది బంగారమస్మంటి మంచితనమే అన్న సోయి లేదా? గాళ్ళు పాడుగాను గింత ఘోరం శేత్తరా నువ్వే శెప్పు శెల్లే!"
అవునవ్వా! మడిషి సచ్చినా బత్కినా అన్నీ  గీ మన్నుల్నే.మిలిగేదీ గీ నడ్మల లోకంల మంచి శెబర మాత్తరమే అన్నది తెల్వదా?" *
"అవును శెల్లే! గందుకే మన పెద్దోళ్ళు ఇహం మన్ను- పరం పైడి "అంటే గిదే అర్తం.
గదండీ సంగతి! " ఇహం మన్ను-పరం పైడి" అంటే ''గిదే మరి. గీ లోకం శాశితం కాదు గిక్కడ మట్లె కల్సుడే వుంది.మంచి జేసే ఆత్మ పై లోకాల్లో బంగారం లెక్క బత్కొచ్చని అర్తం.గదండీ యిష్యం.
కామెంట్‌లు