మీకు శిరసొంచి మా సలాం: - బి.ఉషారాణి-మంచిర్యాల


మంచు గిరులపై నిలిచిన
మహాయోధులారా
మాతృభూమి రక్షణకై
ప్రాణమర్పించు వీరులారా

గడ్డకట్టే చలిలో దాగి
శతృమూకల జాడపట్టి
ముష్కరుల పీచమణచు
భరతమాత ముద్దుబిడ్డలారా

రేపవలు తేడా ఎరుగక
ఆకలిదప్పుల ఊసేలేక
అయినవాళ్లకు దూరంగా
మాతృభూమి రక్షణే ధ్యేయంగా

తూటాలకు మీ గుండెలను
ఎదురు నిలిపి నిలిచి
త్యాగాలకు మరోరూపమై
తనువుపై మమకారం వీడి

జాతిపతాకను వినువీధిలో
స్వేచ్ఛగా ఎగరేస్తూ
భరతమాత గౌరవాన్ని
నలుదిశలా చాటుతున్న

మీ దేశభక్తికి మా వందనం
మీకు శిరసొంచి మా సలాం
కామెంట్‌లు