గానం ఓ జీవిత గాథ: - బి.ఉషారాణి-మంచిర్యాల


మౌనం నిండిన మనసుకు
సంగీతమే ప్రపంచమయ్యింది

తంత్రులను తాకిన ప్రతి స్పర్శ
హృదయ స్పందనగా మారింది

రాగాలు గాలిలో విహరిస్తూ
తలపులకు కొత్త రెక్కలు తొడిగాయి

శబ్దాల హోరును కాదని
నిశ్శబ్దంలోనే పాటలు పల్లవించాయి

కళ్లనుండి జారిన కన్నీటి చుక్కలే
కొన్ని గీతాలకు పల్లవులయ్యాయి

ఎదలో ఉప్పొంగిన ఆవేదనలే
ఆ గీతాలకు చరణాలుగా మారాయి

స్వరం ఒక శ్వాసగా
గానం ఓ జీవిత గాథగా

సప్తస్వరాల సాక్షిగా
ప్రతి అనుభూతి రాగమై పలికింది

సుఖదుఃఖాల లయలో సాగుతూ
కాలాన్ని కట్టిపడేసే సంగీత విభావరిగా మారింది
కామెంట్‌లు