మా తల్లి కైకేయి క్షేమమే కదా!
ఓ నరోత్తమా అందరూ క్షేమమే!
వెంటనే రథమునధిరోహించి బయలుదేరుము
భరతడు మహారాజు వద్దకు వెళ్లి నమస్కరించి
నేను మా తండ్రి గారి వద్దకు వెళ్లెదను
మీరు నన్ను స్మరించినప్పుడు
నేను మీ కడక వచ్చి వాలెదను
నాయనా! భరతా! క్షేమముగా వెళ్ళిరమ్ము
కేకయమహారాజు భరతునకు
బలమైన ఏనుగులను, అశ్వములను
బంగారు నాణములను కానుకగా ఇచ్చెను
భరత శత్రఘ్నులు రథమును అధిరోహించి
దూతలతో అయోధ్యకు వెళ్ళుటకు సిద్ధమైరి
ఇంద్రలోకము నుండి వెళ్లిన సిద్ధుని వలె
తాత గారి ఇంటి నుండి బయలుదేరినారు.
===========================
అయోధ్యకాండము నందు 70వ సర్గ సమాప్తము🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి