నా భారతదేశ జెండా:- యేచన్ చంద్ర శేఖర్ - హైదరాబాద్


కనురెప్పల్లా కాపాడే 
నా సేనల వీరత్వంతో 
గర్వంగా ఎగురుతుంది 
నా భారతదేశ జెండా 

దేశ రక్షకులు వారు 
శత్రువులకు బేజారు 
వారి నిఘా నీడలోనే
నా భారతదేశ జెండా 

సియాచిన్ హిమగిరి 
మంచుకొండల్లో పహారా 
కాసే చేతుల్లో పదిలం 
నా భారతదేశ జెండా 

మన సైనిక దళాల 
వీరత్వం జగద్విదితం 
ఆ శౌర్యంతోనే ఎగిరే
నా భారతదేశ జెండా 

త్యాగానికి ప్రతీకలు 
ధరణీపుత్రులు వారు 
వారి భరోసాతో భద్రం 
నా భారతదేశ జెండా 
కామెంట్‌లు