పట్టుదల :- సరికొండ శ్రీనివాసరాజు

 

 శ్రావణి: "వాసూ! ఈ మధ్య నువ్వు పాఠశాలకు రావడం లేదు. ఎందుకు?
వాసు: నాకు ఆరోగ్యం బాగా ఉండటం లేదు. 
మహేంద్ర: అదేమీ కాదు. వీడు అబద్ధం చెబుతున్నాడు. ఇంటి వద్ద తల్లిదండ్రుల మాటలు వినడం లేదు. అసల చదవడం లేదు. పరీక్షలు మార్కులు రావడం లేదు. ఉపాధ్యాయులు మార్చాలని చూసిన ఉపయోగం లేకుండా పోయింది. అందుకే ఉపాధ్యాయులు వీడిని బడి మానేసి, హ్యాపీగా ఇంటి వద్దనే ఏదైనా పని చేసుకోమని, బడి నుంచి డిస్మిస్ చేశారు. 
వాసు: నువ్వూ వచ్చావ్ నా పరువు తీయడానికి. 
శ్రావణి: వాసూ! నీకు ఎందుకు ఇంత సోమరితనం? మేమంతా కష్టపడి చదవడం లేదా? మంచి మార్కులు తెచ్చుకోవడం లేదా? 
వాసు: నాకు చాలా ఆలస్యంగా జ్ఞానోదయం అయింది. కానీ ఈలోపే సమయం నుంచి పోయింది. ఇప్పటి నుంచి అయినా కష్టపడితే కావాలని అనుకున్నాను. కానీ లాభం లేదు. 
మహేంద్ర: ఇప్పుడు వీడి మాటలు ఇలాగే ఉంటాయి. కానీ కుక్క తోక వంకర బుద్ధి వీడిది. 
శ్రావణి: వాసూ! నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడుతా. 
(శ్రావణి వాసు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాసు వాళ్ళ అమ్మతో ఇలా అంది.)
శ్రావణి: పిన్నీ! వాసును ప్రతిరోజు సాయంత్రం మా ఇంటికి పంపు. ఆదివారాలు, సెలవు దినాల్లో కూడా మా ఇంటికి పంపు. వాసూతో చాలా పని ఉంది పిన్ని.
(శ్రావణి ప్రతిరోజు సాయంత్రం, సెలవు రోజుల్లో వాసుకు అన్ని సబ్జెక్టుల్లో పాఠాలను అర్థమయ్యేటట్లు చెపుతూ, వాసు కష్టపడి చదివిస్తూ కొద్ది రోజుల్లోనే వాసును మంచి ప్రయోజకుణ్ణి చేసింది. పట్టుదల వచ్చిన వాసు అన్ని విషయాలను శ్రద్ధతో నేర్చుకున్నాడు‌. వాసు ఇప్పుడు తెలివైన విద్యార్థి. ఒకరోజు శ్రావణి వాసుని పాఠశాలకు తీసుకువెళ్తుంది. ఉపాధ్యాయులతో వాసూను ఆయా సబ్జెక్టుల్లో పరీక్షించమని అడుగుతుంది. వాసు ఉపాధ్యాయులు ఏది అడిగినా ఠక్కున సమాధానాలు చెబుతున్నాడు. ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయి నారు.)
కృష్ణమాచార్యులు: మన మనసులో చదువుకోవాలని కోరిక బలంగా ఉంటే చదువు అదే వస్తుంది. చదువుకు మూలం పట్టుదల. ఇకనైనా మారినందుకు సంతోషం. వారూ! రేపటి నుంచి బడికి రా!

కామెంట్‌లు