స్వాతంత్రం...!!: -సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.


కాంతిని కంటాం
శబ్దాన్ని వింటాం 
మనసు ఒక జ్ఞాపకం 
ఆలోచన ఒక స్పృహ...!!

సందేశం ఒక నిర్మాణం 
ఆవేశం ఒక విధ్వంసం 
స్వేచ్ఛ స్వాతంత్రం ఒక విశాల ఆకాశం.. 
మనం ఎగిరే పక్షులం..!!

విద్య ఒక అద్భుత గాధ 
మత్తు ఒక విషాద గాధ 
దేశభక్తి మన ఆత్మకథ.....!!

మనిషి ఒక గుడి 
మనిషి ఒక బడి 
ఉపాధ్యాయుడు ఒక దేవుడు.!!

భూలోక చరిత్ర ఒక పుస్తకం 
భూలోక చిత్రగుప్తుడు గురువు..!!

మన ప్రధాని 
మన అధ్యక్షురాలు 
మన ముఖ్యమంత్రి 
ఈ ముగ్గురు జాతీయ చిహ్నాలు!!
ఈ ముగ్గురు మూడు రంగుల జెండాలు!!
వాళ్లు 
నడుస్తున్న మన దేశ గుండెలు..!!

మన గతం ఒక జాతీయ గీతం 
మన అభిమతం మానవత్వం..!!
స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం 
మన తత్వం....!!
మన దేశం ఒక విశాల ఆకాశం 
మనం ఎగిరే పక్షులం........!!..!
===============================
పంద్రాగస్టు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 
===========================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
చాలా బాగా చెప్పారు అన్నగారు కవిత బాగుంది. ధన్యవాదములు. మీకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
డా. పోత్నురి లక్ష్మణ్
నిజామాబాద్