సుప్రభాత కవిత : - బృంద


మరకతములు పోలిన 
కమతముల పై కురియు 
సతత హరిత కాంతుల 
పతకమై భాసిల్లు నేలతల్లి

చిరుగాలితో కలిసి 
చిన్ని  పంటపైరు 
చిందులేయుచు ఊగ
చిట్టిపాప నవ్వై తోచె

సాలు తీరిన కొండలు 
నేలను రక్షించు సేవలో 
వేల కన్నులు తెరచి 
నలుచెరగుల చూపు పరిచి....

కనుల వత్తులు ధరించి 
కనుమలుగా  విడిపోయి 
మునుల వలె ఏకాగ్రతగా
తనువు మరచి నిలిచే!

కనక కాంతులు కురియ 
కలశమొకటి తూర్పున 
కనిపించెనదిగో  గగనవీధిని 
కనుల ముందర నిలుచు దైవమల్లె..

ఉప్పొంగే మానసము 
ఉత్తుంగ తరంగమై 
ఉదయాద్రి దర్శించి 
ఉన్మేష నేత్రములతో!

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు