మా చెల్లి...!!: - డా ప్రతాప్ కౌటిళ్యా.


చంద్రునికి ఒక వలయం 
సూర్యునికి ఒక వలయం 
భూమికి ఒక వలయం 
దేవునికి ఒక ఆలయం. చెల్లె నాకు ఒక నిలయం.!!

కనిపించని అమ్మ 
కనిపించని నాన్న 
కనిపించని అక్క 
నాకు కనిపించే ఒకే ఒక ఆమె మా చెల్లి.!!

ఎన్ని అవతారాలు మారిన 
ఎన్ని జన్మలెత్తినా 
ఎన్ని బంధాలు ఉన్నా 
ఎంతమంది బంధువులు ఉన్నా 
ఒకే ఒక బంధం అన్నా చెల్లెలి అనుబంధం..!!

స్నేహం 
ప్రేమ 
అనురాగము 
మాతృత్వం మరో రూపమే మా చెల్లి.!!

ఎదిగిన వృక్షము 
మెరిసే నక్షత్రము 
ఎగిసే అల మేము కన్నా కల
మా చెల్లి శశికళ...!!

నిండు సముద్రం 
నిండు మనసు 
నిండుకుండా
ఎత్తయిన కొండ మా చెల్లి....!!
===============================
 చెల్లి శశికళకు రక్షాబంధన శుభాకాంక్షలు.
================================
డా ప్రతాప్ కౌటిళ్యా పాలెం.
కామెంట్‌లు