తెలుసుకుందాం! సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ


 వారణాశి అంటే కాశీ పుణ్యక్షేత్రం.ఇక్కడ దగ్గరలో వాటర్ఫాల్ ఉంది.దేవదారీ వాటర్ ఫాల్ 65కి.మీ.దూరంలో ఉంది. 58మీటర్ల ఎత్తునుంచి జలపాతం దూకుతుంది. లఖనియా వాటర్ ఫాల్ 48కి.మీ.దూరంలో లతీఫ్ పుర్ లో ఉంది. ట్రెకర్స్ ఎడ్వెంచర్ లవర్స్ కి భలేగుంటుంది.వింధం  90కి.మీ.దూరంలో ఉన్న పిక్నిక్ స్పాట్.60కి.మీ.దూరంలో రాజదరీ వాటర్ఫాల్,80 కి.మీ. టాండా వాటర్ ఫాల్ చూడదగ్గవి. దగ్గరకు వెళ్లకుండా సెల్ఫీ కోసం ప్రాణాలకు ముప్పు తెచ్చుకోక చూడాల్సిన ప్రాంతాలివి.జీవితంలో చిన్న చిన్న సరదాల ద్వారా కొత్త మార్పు వస్తుంది ఎప్పుడు టీవీ ఫోన్ తో గడపకుండా రోజు ఒక పది వాక్యాలు పుస్తకంపై రాస్తూ ఉంటే కొత్త భావాలు సాహిత్యం పై పట్టు అలవబడుతుంది అలాగే బతుకు భారంగా అనిపించదు మొబైల్ ని టీవీ ని దూరంగా ఉంచి డైరీ రాయడం మట్టితో క్లే తో కాగితపు గుజ్జుతో రకరకాల వస్తువులు హాబీగా చేస్తూ పిల్లల చేత చేయించాలి తరువాత బయటికి వెళ్ళినప్పుడు కాస్త ఎక్కువ దూరం సంధులు గొందులలో వెళుతూ ఉంటే కొత్తదారులు తెలుస్తాయి ఎన్నో విశేషాలు చూస్తాము ఇది వాకింగ్ లాగా హాబీ లాగా ఉంటూ ఆరోగ్యానికి మంచిది నడవటం వల్ల వ్యాయామం కలిగి బీపీ షుగర్ ఉండవు మనసు బుద్ధి చురుకుగా పని చేస్తాయి అలాగే ఇంట్లో స్టాంపులు కలెక్షన్ రకరకాల అగ్గిపెట్టలా బొమ్మలు సేకరించటం చిన్నచిన్న కొత్త వస్తువులు తయారు చేస్తూ డ్రాయింగ్ వేస్తూ కుట్టు అల్లికలతో కాలక్షేపం చేయాలి ఎప్పుడూ సోషల్ మీడియాలో మునిగిపోకుండా రోజుల్లో కనీసం మూడు నాలుగు గంటలు పుస్తక పఠనంలో గడిపితే వినోదం విజ్ఞానం కలుగుతాయి అలాగే ఆలయాలను దర్శిస్తే పుణ్యం పురుషార్థం నలుగురితో కొత్త పరిచయం ఏర్పడుతుంది అలా అని గంటలు గంటలు బాతాకాని వేయరాదు అని హార్వర్డ్ యూనివర్సిటీ సైకాలజిస్టులు అన్నారుషాపింగ్ చేయటం ఒక హాబీగా మారింది షాపింగులు రకరకాల వస్తువులు కొని ఆ సంచులై మొయ్యటం భారమైంది. ఢిల్లీ కి చెందిన ఒక స్టార్టపు చాలా తెలివిగా క్యారీ మ్యాన్ అనే పేరుతో కొత్త సర్వీసు స్టార్ట్ చేశారు 30 నిమిషాల ప్యాకేజీకి 79 రూపాయలు గంటకి 119 రూపాయలు వసూలు చేస్తారు ఢిల్లీలో ప్రారంభమైన ఇది పెద్ద పెద్ద జనాల గుంపులు ఉన్న బజార్లు అలసిపోయిన వస్తువులు కొన్న వారికి ఈ షాపింగ్ బ్యాక్ బిజినెస్ బాగా ఉపయోగపడుతుంది వీరు సంచులు మోయటమే కాక పోర్టబుల్ హోల్డింగ్ చైర్ గొడుగు మొబైల్ ఛార్జింగ్ సపోర్ట్ పవర్ పిల్లల కోసం స్ట్రోలర్ సౌకర్యాలు ఇవ్వటంతో స్త్రీలు సీనియర్ సిటిజనులకు చాలా ఉపయోగంగా ఉంది బ్రిటన్ లో వి క్యారీ బ్యాగ్స్ అనే పేరుతో ఓ కంపెనీ మనిషి వ్యక్తుల సంచులని ఇంటికి హోటల్ కి చేరవేస్తుంది యూరప్ యూకే లో మాల్స్ నుంచి కొన్ని వస్తువులను అక్కడే వదిలితే డెలివరీ చేస్తారు ఆన్ గ్రౌండ్ ఫిజికల్ అసిస్టెంట్స్ ఈ పని చేస్తున్నారు
కామెంట్‌లు